బెంగళూరు రామేశ్వరం కెఫేలో బాంబు పేలుడులో కీలక నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. ముస్సావిర్ హుస్సెన్ షాజిబ్, అబ్దుల్ మతీన్ తాహాను జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. పేలుడు జరిగినప్పటి నుంచి వీరిద్దరు పరారీలో ఉన్నారు. బెంగళూరులో పేలుడు ఘటనకు పాల్పడిన తరవాత ఈ నిందితులిద్దరూ అస్సాం పారిపోయారు. తరవాత పశ్చిమబెంగాల్‌కు మకాం మార్చారు.
బెంగళూరు రామేశ్వరం కెఫేలో బాంబు పేలుడు కేసును జాతీయ దర్యాప్తు సంస్థ సీరియస్‌గా తీసుకుని అనేక మంది అనుమానితులను విచారించింది. సీసీ కెమెరాలో రికార్డైన వీడియోల ఆధారంగా నిందితులను గుర్తించారు. వారి కదలికల ఆధారంగా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.