New feature in
Instagram, nude pics will be automatically blurred
సోషల్ మీడియా యుగంలో ఇన్‌స్టాగ్రామ్‌కి
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా, యువతీ యువకులు ఎక్కువగా రీల్స్ చేస్తూ తమ ప్రతిభను
ప్రదర్శిస్తున్నారు. అదే క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌ను వేదికగా చేసుకుని పాల్పడే
సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. వాటిని నిలువరించేందుకు ఆ సామాజిక మాధ్యమ సంస్థ
ఓ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది.
కొంతమంది నేరస్తులు ఇన్‌స్టాగ్రామ్‌లో
స్నేహాలు పెంచుకుని, వారిని రకరకాలుగా ప్రలోభపెట్టి మాయమాటలు చెప్పి అవతలి వారిని నగ్న
చిత్రాలు డైరెక్ట్ మెసేజ్‌లకు పంపించేలా ఒప్పిస్తారు. తర్వాత బ్లాక్మెయిల్ చేసి
డబ్బులు గుంజడమో లేక లైంగిక వేధింపులకు పాల్పడడమో చేస్తారు. తాము చెప్పినట్టు వినకపోతే
ఆ నగ్నచిత్రాలను ఆన్ లైన్లో ఉంచుతామని బెదిరిస్తారు.
అలాంటి సైబర్ నేరాలకు తమ ప్లాట్‌ఫాంలో
అవకాశం లేకుండా చేయడానికి ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్ ప్రవేశపెడుతోంది. యువత
రక్షణ కోసం కొత్త టూల్ ప్రవేశపెడుతున్నామని గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
డైరెక్ట్ మెసేజ్ లో నగ్నచిత్రాలు తీసి పంపితే ఆ టూల్ అటువంటి చిత్రాలను ఆటోమేటిక్‌గా
బ్లర్ చేస్తుంది. అలా చేయడం ద్వారా
నేరస్తుల బెదిరింపుల నుండి యువతను కాపాడడం
సాధ్యమవుతుందని ఇన్స్టాగ్రామ్ పేర్కొంది.