సందేశ్‌ఖాళీ బాధితుల కోసం సీబీఐ ప్రత్యేక ఈమెయిల్ ఐడీని అందుబాటులోకి తెచ్చింది. పశ్చిమబెంగాల్లోని సందేశ్‌ఖాళీ ప్రాంతంలో భూ కబ్జాలు, లైంగిక వేధింపులు, కిడ్నాప్‌లు, హత్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ కేసులో కీలక నిందితుడు టీఎంసీ నేత షాజహాన్‌ను అరెస్ట్ చేశారు. బాధితుల నుంచి ఫిర్యాదులు అందుకునేందుకు సీబీఐ అధికారులు sandeshkhali@cbi.gov.in మెయిల్ ఐడీని అందుబాటులోకి తెచ్చారు. బాధితులు నిర్భయంగా తమ ఫిర్యాదులు అందించవచ్చని అధికారులు తెలిపారు.
కోల్‌కతా హైకోర్టు ఏప్రిల్ 10వ తేదీన ఇచ్చిన ఆదేశాల మేరకు సీబీఐ ప్రత్యేక మెయిల్ ఐడీ అందుబాటులోకి తీసుకువచ్చింది.సీబీఐ ప్రత్యేక మెయిల్ ఐడీ విడుదల చేయడంతోపాటు బాధితులందరికీ తెలిసేలా సందేశ్‌ఖాళీ ప్రాంతంలో పత్రికల్లో ప్రచురించాలని కోర్టు ఆదేశించింది.