ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత
నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్నాయి. సోదాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 100 కోట్ల
విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, గిఫ్ట్స్ స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల
ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.
కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు
సరిహద్దు ప్రాంతాలు, జిల్లా సరిహద్దుల వద్ద సోదాలను మరింత
విస్త్రృతం చేశామన్నారు.
సరిహద్దు
రాష్ట్రాల పోలీసు బలగాలు, ఇతర ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో
సమాచారాన్ని పంచుకుంటున్నామన్నారు. తనిఖీల్లో సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బందీ
లేకుండా వ్యవహరించాలని బృందాలను ఆదేశించామన్నారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు