ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో పాత్రధారిగా ఉన్న బారాస ఎమ్మెల్సీ కవితను తిహార్ జైల్లో సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితను ఈడీ అరెస్ట్ చేసింది. కవిత జుడీషియల్ కస్టడీలో ఉన్నారు. తాము కూడా విచారించాల్సి ఉందని సీబీఐ, ప్రత్యేక కోర్టు నుంచి అనుమతి పొందింది. అయితే తనకు ముందుగా నోటీసులు ఇచ్చి విచారణ చేసుకోవాలంటూ కవిత కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు.
కవితను విచారించేందుకు ఆమెను తమ కస్టడీకి అనుమతించాలంటూ సీబీఐ ఇప్పటికే ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు. అక్కడ నుంచి తీర్పు రాకముందు సీబీఐ అధికారులు కవితను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.కోర్టు అనుమతితో ఈ నెల 6న కవితను విచారించిన సీబీఐ మరోసారి విచారించేందుకు సిద్దం అవుతోందని తెలుస్తోంది.