ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ
పార్టీలు నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందేనని కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి తేల్చి చెప్పింది.
ప్రచార హోర్డింగులతో పాటు ఎన్నికల సామగ్రిపై
ప్రింటర్, పబ్లిషర్ పేర్లు స్పష్టంగా కనిపించేలా
ముద్రించాలని స్పష్టం చేసింది. జవాబుదారీతనం, పారదర్శకత
పెంచేందుకే ఈ నిబంధన విధించినట్లు వివరించింది.
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో
రాజకీయపార్టీలు ఏర్పాటు చేసిన హోర్డింగులపై ప్రింటర్, పబ్లిషర్ పేర్లు లేవంటూ ఆమ్ ఆద్మీ పార్టీ సహా
ఇతరులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఎన్నికల సంఘం తాజా ఆదేశాలు జారీ చేసింది.
స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే
ఎన్నికల గుర్తుల నుంచి బుల్ డోజర్ ను ఎన్నికల సంఘం తొలగించింది. ఎందుకు తొలగించిందనే
కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. చిన్న పిల్లల బొమ్మలు, ఎలక్ట్రానిక్స్ వస్తువులతో
సహా పలు వస్తువుల చిహ్నాలను ఎన్నికల గుర్తుల జాబితాలో చేర్చారు. తాజాగా ఈసీ అప్
లోడ్ చేసిన జాబితాలో 190 ఎన్నికల గుర్తులు ఉన్నాయి.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్