రక్షణ శాఖ పర్యవేక్షణలో నడవాల్సిన పాఠశాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్కు కట్టబెట్టాలని చూస్తోందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు ఖర్గే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.దేశంలో ప్రస్తుతం 33 సైనిక్ స్కూళ్లు నడుస్తున్నాయి. రాజకీయాలకు అతీతంగా నడుస్తున్నాయి. వీటిని ప్రైవేటీకరించి బీజేపీ సిద్ధాంతాలను విద్యార్థులపై రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నారని ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కేంద్రం స్పందించింది.
సైనిక్ స్కూళ్ల నిర్వహణ ప్రైవేటుకు అప్పగించినా వాటి పర్యవేక్షణ కేంద్రం చూసుకుంటుందని రక్షణ మంత్రి ప్రకటించారు. ప్రైవేటురంగంలో పేరుప్రఖ్యాతులు ఉన్న విద్యాసంస్థలను వడబోయడం ద్వారా ఎంచుకుంటామన్నారు. 500 మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం 45 మంది మాత్రమే సైనిక్ స్కూళ్ల నిర్వహణకు అర్హత పొందినట్లు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గుర్తుచేశారు.