వేసవి
రద్దీని నివారించేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ నుంచి పలు
ప్రాంతాలకు సమ్మర్ స్పెషల్ ట్రైన్లు నడపాలని దక్షిణ మధ్య రైల్వే విభాగం
నిర్ణయించింది. విద్యార్థులు సొంతూళ్ళకు వెళ్ళడంతో పాటు తీర్థయాత్రలు, విహార యాత్రలకు
వెళ్ళే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆ దిశగా ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది.
సికింద్రాబాద్-
షాలిమార్(పశ్చిమబెంగాల్),
సికింద్రాబాద్- కొల్లం మధ్య ప్రత్యేక సర్వీసులు
పరుగులు తీయనున్నాయి.
సికింద్రాబాద్-సాంత్రాగాఛి
( ట్రైన్ నంబర్ 07223) సర్వీసు ప్రతీ
శనివారం సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 28
వరకు 11 మార్లు రెండు నగరాల మధ్య చక్కర్లు కొట్టనుంది. ఈ రైలు తెలంగాణలోని నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్లలో ఆగనుండగా, ఏపీలో
గుంటూరు, విజయవాడ, దువ్వాడ, విజయనగరం, ఒడిశాలోని భువనేశ్వర్, కటక్, ఖరగ్పుర్ మీదుగా రాకపోకలు సాగించనుంది.
సికింద్రాబాద్-షాలిమార్
( నంబర్ 07225) స్పెషల్ ట్రైన్ తెలంగాణలో కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం స్టేషన్లలో ఆగనుండగా ఏపీలో రాయనపాడు, రాజమహేంద్రవరం, దువ్వాడ, ఒడిశాలోని భువనేశ్వర్, ఖరగ్పుర్, సాంత్రాగాఛిలో ఆగనుంది.
సికింద్రాబాద్-కొల్లం
మధ్య నడిచే సర్వీసు నల్గొండ, మిర్యాలగూడ,
గుంటూరు, ఒంగోలు, రేణిగుంట, తమిళనాడులోని కాట్పాడి, ఈరోడ్, కోయంబత్తూరు,
కేరళలోని ఎర్నాకుళం, కొట్టాయం, కాయంకుళం స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగించనుంది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు