అయోధ్య బాల రాముడికి ఓ భక్తుడు అరుదైన కానుక అందించారు. 7 కేజీల బంగారంతో రూపొందించిన రామాయణం రామయ్యకు సమర్పించుకున్నారు. దీని విలువ రూ.5.7 కోట్లు. 500 బంగారు పేజీలపై రామాయణాన్ని రాశారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ్ జీవితాంతం సంపాదించిన మొత్తాన్ని బాల రాముడికి అంకితం చేశారు. 151 కిలో బరువున్న రామాయణాన్ని తయారు చేయించారు. ఇందులో 10902 శ్లోకాలున్నాయి. వాటిని బంగారంతో పూత వేయించారు.
స్వచ్ఛమైన 24 క్యారెట్ల 7 కిలోల బంగారంతోపాటు, దీని తయారీకి 140 కేజీల రాగిని కూడా వాడారు. అయోధ్య బాలరాముని ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా 9 రోజుల ప్రత్యేక వేడుకల మొదలయ్యాయి.