ఆమ్
ఆద్మీ పార్టీ(AAP)కి భారీ షాక్ తగిలింది. కేజ్రీవాల్ కేబినెట్లో సాంఘిక సంక్షేమ శాఖ
మంత్రిగా ఉన్న రాజ్ కుమార్ ఆనంద్ తన
పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఆప్
తీవ్రమైన అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించిన కేజ్రీవాల్, అవినీతిపరులతో తాను
కలిసి ఉండలేనన్నారు.
ప్రజలకు సేవ చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరినట్లు
తెలిపారు. ఇకపై ఆప్తో కలిసి పని చేసేది లేదన్నారు. పార్టీలో ఎస్సీ నేతలకు సరైన
గౌరవం దక్కడం లేదని ఆవేదన చెందారు. ఎస్సీలకు మోసం జరిగిందని ఆరోపించిన రాజ్ కుమార్
ఆనంద్ హైకోర్టు తీర్పు తర్వాత ఆప్ వైపు తప్పు ఉందని
తెలుస్తోందన్నారు.
రాజ్
కుమార్ పటేల్ నగర్ నుంచి అసెంబ్లీకి
ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంత్రి పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి
కూడా రాజీనామా చేశారు.
అమాత్యుడి
హోదాలో లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్, ఎస్సీ,
ఎస్టీ, ల్యాండ్ అండ్ బిల్డింగ్, కోఆపరేటివ్, గురుద్వారా ఎలక్షన్
డిపార్టుమెంట్స్ అదనపు బాధ్యతలను కూడా నిర్వహించారు.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్