అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుతోన్న సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ సూచీలు దూసుకెళుతున్నాయి. ఐటీసీ, రిలయన్స్, ఎయిర్టెల్ షేర్లను భారీగా కొనుగోలు చేశారు. దీంతో సెన్సెక్స్ మొదటిసారి 75 వేల పాయింట్ల ఎగువున ముగిసింది. నిఫ్టీ 22700 మార్కు దాటింది.
ఉదయం ప్రారంభంలో సెన్సెక్స్ 74953 వద్ద లాభాలతో మొదలైంది. డే మొత్తం లాభాల్లో ట్రేడైంది. ముగింపు సమయానికి సెన్సెక్స్ 354 పాయింట్లు పెరిగి 75038 వద్ద ముగిసింది. నిఫ్టీ 111 పాయింట్లు పెరిగింది. డాలరుతో రూపాయి విలువ రూ.83.19 వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్ 30 ఇండెక్సులో కోటక్ మహింద్రా, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాలార్జించాయి. మహీంద్రా అండ్ మహింద్రా, టాటా స్టీల్, మారుతీ సుజుకీ, ఎల్ అంట్ టీ, హెచ్డీఎఫ్సీ షేర్లు నష్టాలను చవిచూశాయి. ముడి చమురు ధరలు స్వల్పంగా పెరిగాయి. బ్యారెల్ 89.70 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ధరలు దూసుకెళ్లాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్యూర్ గోల్డ్ 2365 డాలర్లకు చేరింది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు