ఎన్నికల
ప్రచారంలో భాగంగా తమిళనాడులో ప్రధాని మోదీ కీలక వాగ్దానం చేశారు. శ్రీలంకలో
అరెస్ట్ అయిన భారత మత్స్యకారులను క్షేమంగా భారత్‌కు తీసుకువస్తామని మోదీ హామీ
ఇచ్చారు.
వేలూరులో
నిర్వహించిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ, దేశంలో కాంగ్రెస్, డీఎంకే పార్టీల కపట నాటకం గురించి చర్చ
జరుగుతుందన్నారు.
కాంగ్రెస్ హయాంలోనే కచ్చాతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించిన
విషయాన్ని ప్రస్తావించారు. ఎవరి ప్రయోజనం కోసం కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందని
ప్రశ్నించారు.
కచ్చాతీవు
ద్వీపం వద్దకు వేటకు వెళ్ళిన వేలాది మంది తమిళనాడు మృత్స్యకారులను శ్రీలంక కోస్టల్
అధికారులు అరెస్ట్ చేసిన విషయాన్ని మోదీ ప్రస్తావించారు.
మత్స్యకారుల అరెస్ట్‌పై కాంగ్రెస్ ఎందుకు మౌనం వహించిందో
సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ ప్రభుత్వం మాత్రం అరెస్ట్ అయిన
మత్స్యకారులను క్షేమంగా వెనక్కి తీసుకురావడంతో పాటు మరణ శిక్షలు విధింపబడిన వారిని
కూడా సజీవంగా తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటుందన్నారు.
అధికార డీఎంకే ప్రభుత్వంపై ప్రధాని మోదీ తీవ్ర
విమర్శలు చేశారు. తమిళ సంస్కృతికి డీఎంకే వ్యతిరేకమని దుయ్యబట్టారు. విభజన రాజకీయాలకు
పాల్పడుతూ . తమిళులను చీకట్లో ఉంచేసిందన్నారు. తమిళనాడులో బీజేపీ చరిత్ర
సృష్టించబోతోందని ధీమా వ్యక్తం చేశారు.