నెల్లూరులో విషాద ఘటన జరిగింది. ఓ బాలుడు ఆడుకుంటూ వెళ్లి ఆలయం వద్ద ఓ బాటిల్లో ఉంచిన పెట్రోల్ తాగేశాడు. కూల్డ్రింక్ అనుకుని పెట్రోల్ తాగినట్లు అనుమానిస్తున్నారు. పెట్రోల్ తాగిన బాలుడు చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం.
కూల్ డ్రింక్ అనుకుని పెట్రోల్ తాగిన ఘటన నెల్లూరు సిటీలో చోటు చేసుకుంది. నగరంలోని ఇరుగాళమ్మ కట్ట ప్రాంతానికి చెందిన షేక్ కరిముల్లా, అమ్ము దంపతుల రెండేళ్ల కుమారుడు కాలేషా తెలియక పెట్రోల్ తాగేశాడు. ఇది గమనించిన వారు వెంటనే ఆసుపత్రికి తరలించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాలేషా మృతిచెందాడని పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు