ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన అరెస్టును సవాల్ చేస్తూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన తరపు న్యాయవాది వివేక్ జైన్ ఈ విషయం మీడియాకు వెల్లడించారు. ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్‌కు ఎదురు దెబ్బతగలడంతో ఆయన సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు.
ఢిల్లీ హైకోర్టులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి కొట్టివేశారు. తగిన ఆధారాలున్నాయని ఈడీ కోర్టుకు వివరించడంతో కేజ్రీవాల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. తన అరెస్ట్, రిమాండ్ చట్టవిరుద్దమంటూ అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు చేసిన వాదనలు నిలబడలేదు. అప్రూవర్ స్పష్టంగా చెప్పారని గోవా ఎన్నికలకు డబ్బు తరలించారని ఈడీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
మద్యం విధానాన్ని కొందరికి అనుకూలంగా మార్చి, వారి వద్ద నుంచి గోవా, పంజాబ్ ఎన్నికలకు డబ్బు తరలించారని ఈడీ అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటికే నలుగురు అప్రూవర్లుగా మారారు. వారిచ్చిన సమాచారంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు.