మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం
చోటుచేసుకుంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్ థాకరే, ఎన్డీయే
కూటమికి బేషరతుగా మద్దతు ప్రకటించారు. ప్రధాని మోదీ నాయకత్వం ప్రస్తుతం భారత్ కు
ఎంతో అవసరం అన్నారు. ఈ లోక్ సభ ఎన్నికల తీర్పు పైనే దేశ భవిష్యత్ ఆధారపడి
ఉందన్నారు.
ముంబైలోని శివాజీ పార్క్ వద్ద
గుడిపడ్వా వేడుకల్లో పాల్గొన్న రాజ్ థాకరే, లోక్‌సభ ఎన్నికల్లో ఎంఎన్‌ఎస్ పోటీ
చేయదని తెలిపారు. అయితే ఈ ఏడాది చివర్లో జరగనున్న మహారాష్ట్ర
అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ‘మహాయుతి’ కూటమి నుంచే పోటీ ఉంటుందన్నారు.
తనకు రాజ్యసభ, విధానసభ
పదవులు వద్దని ఫడ్నవీస్‌తో చెప్పినట్లుల సమావేశంలో వెల్లడించారు. షరతులు లేకుండా
ప్రధాని మోదీతో పాటు మహాయుతి కూటమికి మద్దతిస్తున్నా అన్నారు.
ఎంఎన్‌ఎస్
2014 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఘోరంగా ఓడింది. ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అసలు పోటీనే చేయలేదు.
ఆస్తులన్నీ కాజేసిన అన్నగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు : షర్మిల