విశాఖపట్నం
ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రివర్గ సమావేశాల్లో చర్చించలేదని బీజేపీ
ఏపీ ఎన్నికల సహ ఇన్‌ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్ తెలిపారు. ప్రతిపాదనలు వచ్చినంత
మాత్రాన వాటిని అమలు చేస్తున్నట్లు కాదు అని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
లో పర్యటించిన సిద్ధార్థనాథ్ సింగ్ విజయవాడలోని
బీజేపీ ఆఫీసులో జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు.
పోలవరం
ప్రాజెక్టు నిర్మాణాన్ని వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేసిందన్నారు.
డిజైన్లు మార్చి, వ్యయాన్ని పెంచి కాంట్రాక్టర్లకు మేలు
చేసేందుకు ప్రయత్నించిందన్నారు.
ఈ
ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలవగానే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాన్నారు.
టీడీపీతో కలిసి కేంద్ర ప్రభుత్వ నిధులతో అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తామన్నారు.
వికసిత్ భారత్‌తోపాటు వికసిత్ ఆంధ్రప్రదేశ్
ప్రధాని మోదీ సంకల్పం అన్నారు.
పొత్తులో బీజేపీకి కేటాయించిన అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు విషయంలో గానీ, ప్రకటించిన అభ్యర్థుల విషయంలోగానీ ఎలాంటి మార్పులు
ఉండవని తేల్చి చెప్పారు.