ఆంధ్రప్రదేశ్
వ్యాప్తంగా ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కొంతకాలంగా పెరుగుతున్న గరిష్ఠ
ఉష్ణోగ్రత కొంత శాంతించింది. ఉష్ణోగ్రతలు మంగళ, బుధవారాల్లో
రెండు నుంచి మూడు డిగ్రీలు తగ్గే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం
ప్రకటించింది.
ఉత్తర
కోస్తాలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో గురువారం తేలికపాటి
నుంచి ఓ మోస్తరు వర్షాలు,
కొన్నిచోట్ల ఉరుములతో కూడిన జల్లులు
కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. కొన్ని చోట్ల పిడుగులు
పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
నిన్న(మంగళవారం)
9 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో
53 మండలాల్లో వడగాలులు వీచాయి. నేడు (బుధవారం) 11 మండలాల్లో తీవ్ర వడగాలులు, 134 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం
ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని
హెచ్చరించింది.
ఈ
ఏడాది మార్చిలో సగటు ఉష్ణోగ్రత 14.4 డిగ్రీల సెల్సియస్ గా నమోదైనట్లు కోపర్‌నికస్
క్లైమేట్ ఛేంజ్ సర్వీస్ (సీ3ఎస్) తెలిపింది. పారిశ్రామికీకరణ కాలానికి ముందు ముందునాటి తో
పోలిస్తే 1.68 డిగ్రీల సెల్సియస్ అధికం. 1991- 2020 కాలంలో నమోదైన పోలిస్తే 0.73
డిగ్రీల సెల్సియస్ ఎక్కువ. ఇప్పటివరకూ
మార్చిలో అధిక ఉష్ణోగ్రతలు 2016లో
నమోదయ్యాయి. అప్పటి కంటే ఈ ఏడాది మార్చిలో
0.10 డిగ్రీల సెల్సియస్ మేర ఎక్కువగా నమోదైనట్లు సీ3ఎస్ పేర్కొంది.