లోక్‌సభ ఎన్నికల వేళ భారత ప్రధాన
ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌కు ‘జెడ్’ కేటగిరి భద్రత కల్పించారు. ఎన్నికల
నేపథ్యంలో ముప్పు పొంచి ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ
వర్గాలు తెలిపాయి.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన
ఎన్నికల కమిషనర్‌కు భద్రతకు ముప్పు పొంచి
ఉండే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వానికి భద్రతా ఏజెన్సీలు నివేదించాయి. దీంతో సెంట్రల్
రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన 40 నుంచి 45 మంది సిబ్బంది సీఈసీకి రక్షణ కల్పిస్తున్నారు.
రాజీవ్ కుమార్, 1984 ఐఏఎస్
బ్యాచ్‌కు చెందినవారు. 2020లో ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. మే 15, 2022న 25వ
ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు.