భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి
దేవస్థానంలో వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీరామనవమి వేడుకలకు కూడా నేడే అంకురార్పణ
జరిగింది. నేటి నుంచి ఈ నెల 23 వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి.
క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్భంగా
ప్రసాద వితరణ అనంతరం ఉత్సవాలు
ప్రారంభించారు. సాయంత్రం స్వామివారికి కల్పవృక్ష వాహనంలో తిరువీధి సేవ
జరిపిస్తారు.
నవమి రోజున శ్రీ సీతారామ కళ్యాణం
నిర్వహించే వారిలో వైదిక పెద్దలు ప్రముఖ పాత్ర పోషిస్తారు. ఈ ఏడాది
బ్రహ్మోత్సవాల్లో అధ్వర్యులుగా పొడిచేటి సీతారామానుజాచార్యులు, బ్రహ్మగా అమరవాది గోపాలకృష్ణమాచార్యులు,
ఆచార్యులుగా
కోటి శ్రీమన్నారాయణాచార్యులు, రుత్విక్లుగా అమరవాది
మురళీకృష్ణమాచార్యులు, సీతారామాచార్యులు, పరిచార రుత్వికులుగా రాఘవాచార్యులు,
అలంకరాల
రుత్విక్లుగా కోటి రామస్వరూప్, కోటి విష్ణు వ్యవహరించనున్నారు.
బ్రహ్మోత్సవాల వివరాలు -2024
ఏప్రిల్ 9 – ఉగాది, తిరువీడి సేవ
ఏప్రిల్ 13 – అంకురార్పణం
ఏప్రిల్ 14 – గరుడ పథ లేకనం
ఏప్రిల్ 15 – అగ్ని ప్రతిష్ట, ద్వజారోహణం
ఏప్రిల్ 16 – చతుఃస్థానార్చన, ఎదురుకోలు
ఏప్రిల్ 17 – శ్రీరామ నవమి కళ్యాణం
(ఉదయం 10.30 – మధ్యాహ్నం 12.30)
ఏప్రిల్ 18 – మహా పట్టాభిషేకం
ఏప్రిల్ 19 – సదస్యం, హంస వాహన సేవ
ఏప్రిల్ 20 – తెప్పోత్సవం, చోరోత్సవం, అశ్వ వాహన సేవ
ఏప్రిల్ 21 – ఊంజల్ ఉస్తవం, సింహ వాహన సేవ
ఏప్రిల్ 22 – వసంతోత్సవం, హవనం, గజ వాహన సేవ
ఏప్రిల్ 23 – చక్రతీర్థం, పూర్ణాహుతి