తెలంగాణ కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటిలిజెన్స్ ఐజీ రాజీవ్ రతన్ హఠాన్మరణం పాలయ్యారు. మంగళవారం ఆయనకు గుండెపోటు రావడంతో, వెంటనే ఆయన్ని ఏఐజీ హాస్పటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆయన కన్ను ఇవాళ ఉదయం మూశారు. గతంలో రాజీవ్ రతన్ కరీంనగర్ ఎస్పీగా సేవలందించారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు.
రాజీవ్ రతన్ మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పలువురు ప్రముఖులు, అధికారులు ఏఐజీ ఆసుపత్రికి చేరుకుని రాజీవ్ రతన్ కుటుంబ సభ్యులను ఓదార్చారు.