సీఎం జగన్మోహన్రెడ్డి పర్యటనలో భద్రతా వైఫల్యం బయట పడింది. ఓ వ్యక్తి సీఎం కాన్వాయ్ వద్దకు ప్రవేశించి, తల చేతులతో కారు అద్దాలు ధ్వంసం చేయడం సంచలనంగా మారింది. భద్రతా వైఫల్యమా, కుట్ర కోణమా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలోని పొదిలిలో ఈ ఘటన ఆదివారం నాడు చోటు చేసుకుంది. సీఎం కాన్వాయ్‌లోని వాహనంపై దాడికి దిగిన వ్యక్తిని కంభాలపాడుకు చెందిన వైసీపీ వీరాభిమాని విష్ణుగా గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు.
2014 ఎన్నిలకు ముందు అప్పటి ప్రతిపక్షనేతగా ఉన్న జగన్మోహన్రెడ్డిపై కోడికత్తిదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే జగన్ పర్యటించే ప్రాంతాల్లో చెట్లన్నీ తొలగిస్తున్నా, ఇలాంటి ఘటన జరగడంపై అనుమానాలు కలుగుతున్నాయి. తన సోదరుడి చదువుకు ప్రభుత్వం నుంచి ఫీజు రీఎంబర్మెంట్ రూ.2.20 లక్షలు రావాల్సి ఉందని, కుటుంబం మొత్తం తన మీదే ఆధారపడి ఉందని దాడికి దిగిన విష్ణు చెబుతున్నారు. బాగా మద్యం తాగడం వల్లే మతితప్పి ఈ ఘటనకు పాల్పడ్డాడనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు