కన్యాదానం చేయకపోయినా వధూవరులు కలసి ఏడు అడుగులు నడిస్తే వివాహం అయినట్లేనని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మార్చి 22న ఈ తీర్పు రాగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అశుతోశ్ యాదవ్ వేసిన పిటిషన్ విచారించి కోర్టు ఈ తీర్పు వెలువరించింది. అత్తింటి వారు యాదవ్పై క్రిమినల్ కేసు నమోదు చేయడంతో ఆయన కూడా కోర్టును ఆశ్రయించారు.
యాదవ్ అత్తింటివారు వేసిన కేసు విచారణ సందర్భంగా అలహాబాదు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పెళ్లిలో కన్యాదానం జరగలేదు కాబట్టి వివాదం చెల్లదనే వాదనలను న్యాయవాది వినిపించారు. అయితే కన్యాదానం కన్నా హిందూ వివాహ వ్యవస్థలో సప్తపదే కీలకమని తీర్పు నిచ్చింది. దీంతో కన్యాదానం జరగకపోయినా, ఏడు అడుగులు పడితే వివాహం జరిగినట్టేననే తీర్పు కింది కోర్టులకు దిక్చూచిలా నిలవనుంది.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు