Complaint on TTD EO to CEO by TDP-BJP combine
వైఎస్ఆర్సిపి కార్యకర్తలా మారి అవినీతి
కార్యకలాపాలకు పాల్పడుతూ తిరుమల పవిత్రతను భగ్నపరుస్తున్న తిరుమల తిరుపతి
దేవస్థానం ఈవో ధర్మారెడ్డిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ, టీడీపీ డిమాండ్ చేసాయి. ఆ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్
కుమార్ మీనాకు ఫిర్యాదు చేసాయి.
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఆ పార్టీ
నాయకుడిలా వ్యవహరించే టీటీడీ ఈఓ తీరుపై బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్
రెడ్డి, ఇతర నాయకులు గతంలో ఎన్నోసార్లు
కోర్టులో కేసులు వేసారు. కోర్టులు కూడా టీటీడీ వైఖరికి వ్యతిరేకంగా తీర్పులిచ్చాయి.
టీటీడీ సమీపగతంలోనూ ఒక శాతం అంటే దాదాపు 50 కోట్ల రూపాయలను విడుదల చేసే ప్రయత్నం చేసింది. ధార్మిక సంఘాలు, బీజేపీ చేసిన పోరాటం వల్లనే వెనక్కి తగ్గింది. ఆ ఘటన జరిగి నెలైనా
తిరగకుండానే తిరుపతి మునిసిపల్ శానిటేషన్ వర్కర్ల జీతాల రూపంలో 100 కోట్ల రూపాయలు విడుదల చేయాలన్న టీటీడీ ప్రయత్నాన్ని బీజేపీ
తిప్పికొట్టింది. 2020లో టీటీడీకి చెందిన 5వేలకోట్లను రాష్ట్ర ప్రభుత్వ బాండ్ల రూపంలో దారి మళ్ళించే కుట్రను బిజెపి,
ఇతర మఠాధిపతులూ అడ్డుకున్నారు. గత 8 నెలల్లో టీటీడీ
చైర్మన్ కరుణాకర్ రెడ్డి కొడుకు, ప్రస్తుత తిరుపతి డిప్యూటీ మేయర్, వైసీపీ తిరుపతి
అసెంబ్లీ అభ్యర్థి అభినయ్ని గెలిపించడం కోసం ఈఓ ధర్మారెడ్డి 1500 కోట్ల టెండర్లు పిలిచారు. అంత పెద్దఎత్తున టీటీడీ నిధులు సివిల్ పనుల
కోసం దారి మళ్ళించే ప్రయత్నం చేసారు. అందులో టీటీడీ చైర్మన్ సివిల్ పనులలో 10%,
రోడ్డు పనులలో 15% జేలంచాలు తీసుకోవడం మరింత దారుణం. రూల్స్ కి విరుద్దంగా తిరుమలను
వైసీపీ కార్యాలయంగా మారుస్తున్న ఈఓ ధర్మారెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ
డిమాండ్ చేసింది.
రాష్ట్ర సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను బీజేపీ
అధికార ప్రతినిధులు భాను ప్రకాష్ రెడ్డి,
సాదినేని యామిని శర్మ, మీడియా పానలిస్ట్ పాటిబండ్ల రామకృష్ణ,
తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి
కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు. దానికి సంబంధించిన ఆధారాలను కూడా వారికి అందజేసారు.