Krishna Tribunal Refuses to grant time requested by AP
కృష్ణా నదీ జలాల వివాదం విషయంలో తమ పూర్తి వివరణ
దాఖలు చేయడానికి గడువు కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. రాష్ట్రంలో లోక్సభ,
శాసనసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జూన్ నెల వరకూ సమయం ఇవ్వాలంటూ విజ్ఞప్తి
చేసింది.
ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తిపై తెలంగాణ రాష్ట్రం
అభ్యంతరాలు వ్యక్తం చేసింది. పెండింగ్లో ఉన్న కేసులకు ఎన్నికల నియమావళి అడ్డంకి
కాదని, వాటి విచారణ యథావిధిగా కొనసాగించవచ్చుననీ వాదించింది. కాల యాపన చేయడానికి
మాత్రమే ఆంధ్ర రాష్ట్రం గడువు కావాలని అడుగుతోందని ఆరోపించింది.
ఇరుపక్షాల వాదనలూ విన్న ట్రైబ్యునల్,
జూన్ వరకూ గడువు ఇవ్వడం వీలుకాదని తేల్చిచెప్పింది. ఈ ఏప్రిల్ నెల 29వ తేదీలోగా
వివరణ ఇవ్వాలని సూచించింది. ప్రకటన ఇచ్చిన తర్వాత పక్షం రోజుల వ్యవధిలో కౌంటర్
దాఖలు చేయాలంటూ ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలనూ ఆదేశించింది.