పేదరిక
నిర్మూలనలో భారత్ పనితీరు అద్భుతమని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు
డెనిస్ ఫ్రాన్సిస్ ప్రశంసించారు.
డిజిటలైజేషన్‌ను
సమర్థంగా వినియోగించుకోవడంతో పాటు ఆర్థిక వ్యవస్థలో కోట్లాదిమందిని భాగస్వాములు
చేస్తోందని కొనియాడారు. డిజిటలైజేషన్ మోడల్‌తోనే ఇది సాధ్యమవుతోందని
పేర్కొన్నారు.
ఉత్పాదకతను పెంచడం, తక్కువ
ఖర్చు, సమర్థవంతమైన ఆర్థిక
వ్యవస్థ నిర్మాణంతోనే ఈ మార్పు సాధ్యమన్నారు. మహిళలు, రైతులు సహా ప్రతి ఒక్కరూ తామున్న చోటు
నుంచే చెల్లింపులు చేయడాన్ని గుర్తించామన్నారు.
కార్మికులకు
నిరంతరం పని లభిస్తుండటంతో వివిధ
వస్తువులకు గిరాకీ పెరిగిందన్నారు. తద్వారా ఆర్థిక వ్యవస్థ గణనీయ వృద్ధి నమోదు చేసిందని
వివరించారు.
మౌలిక వసతుల అభివృద్ధిని పర్యావరణ అనుకూల విధానాలతో ముడిపెట్టాలని
సూచించిన ఫ్రాన్సిస్, పర్యావరణాన్ని విస్మరిస్తే భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థకు
ముప్పుగా పరిణమిస్తుందని హెచ్చరించారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు