జమ్మూకశ్మీర్లోని
కిష్ట్వార్ ప్రాంతంలో మరోసారి భూమి కంపించింది. ఆదివారం
తెల్లవారుజామున 2.47 గంటలకు భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్
పై తీవ్రత 3.5గా నమోదైంది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.
అర్ధరాత్రి
వేళ భూమి కంపించడంతో ప్రజలు నివాసాల నుంచి బయటకు పరుగులు తీశారు. కిష్ట్వార్లో
గత రెండు రోజుల్లో మూడోసారి భూప్రకంపనలు రావడంతో స్థానికులు భయాందోళన
చెందుతున్నారు.
శనివారం
మధ్యాహ్నం 3.8 తీవ్రతో భూమి కంపించగా అంతకు ముందు శుక్రవారం
రాత్రి కూడా భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టరు స్కేలుపై 3.2 గా నమోదైంది. భూమి కంపించినప్పటికీ ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.