లండన్ హీత్రూ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. రెండు విమానాలు ఢీ కొన్నాయి. వర్జిన్ అట్లాంటిక్‌కు చెందిన బోయింగ్ విమానం ల్యాండ్ అయ్యాక ప్రయాణీకులు దిగిపోయారు. తరవాత విమానాన్ని గ్యారేజ్‌కు తరలించే క్రమంలో మరో విమానం ఢీ కొట్టింది. తుపాను కారణంగా విమానాశ్రయంలో 70 కి.మీ వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. దీంతో అనేక విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు.
విమానాలు ఢీ కొన్న ఘటనలో ప్రాణనష్టం జరగలేదు. రెండూ స్వల్పంగా దెబ్బతిన్నాయి. విమానాలకు ఎంత నష్టం వాటిల్లింది అనే దానిపై ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. కేథలిన్ తుపాను ప్రభావంతో అనేక విమానాలను దారిమళ్లిస్తున్నారు. ఓ అంతర్జాతీయ విమానం దిగే చేసే సమయంలో పెనుగాలి రావడంతో మరలా దాన్ని ఫైలెట్ చాకచక్యంగా వెనక్కు తీసుకెళ్లడంతో పెనుప్రమాదం తప్పింది. కేథలిన్ తుపాను ప్రభావంతో దేశంలో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలిగినట్లు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. వరదలు వచ్చే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు