దేశంలో యూపీఐ లావాదేవీలు అనూహ్యంగా పెరిగాయి. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 13100 కోట్ల లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ.199 లక్షల కోట్లుగా ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.139 లక్షల కోట్ల విలువైన 8400 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయి. గత ఆర్థిక సంవత్సరం కన్నా 2023-24 ఆర్థిక ఏడాదిలో లావాదేవీలు 57 శాతం పెరిగాయి. విలువ పరంగా 44 శాతం వృద్ధి నమోదైంది.
2023 మార్చితో పోల్చుకుంటే గత మార్చిలో లావాదేవీలు 55 శాతం పెరిగాయి. విలువ చూసుకుంటే 40 శాతం పెరిగాయి. గత మార్చిలో 19.78 లక్షల లావాదేవీలు నమోదయ్యాయి. 2024 ఫిబ్రవరిలో 18.18 లక్షల కోట్ల విలువైన 1219 కోట్ల లావాదేవీలు జరిగాయి.