పంజాబ్లో ఘోరం వెలుగుచూసింది. మానవత్వం మంట గలిపిన సంఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. పంజాబ్లోని వాల్తొహ గ్రామంలో ఓ మహిళను వివస్త్రను చేసి, కొట్టి, ఆ తరవాత అర్థనగ్నంగా ఊరేగించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 31న ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
పోలీసుల కథనం ప్రకారం. బాధితురాలి కుమారుడు ఓ మహిళతో పారిపోయాడు. ఆమె పెళ్లి చేసుకున్నాడు. తరవాత కొంత కాలానికి గ్రామానికి తిరిగి వచ్చి కాపురం పెట్టారు. తల్లితో కలసి నివాసం ఉంటున్నాడు. గత నెల 31న కొందరు గ్రామస్థులు యువకుడి తల్లిపై మూకమ్మడిగా దాడికి దిగారు. దుస్తులు చింపేశారు. గ్రామంలో అర్థనగ్నంగా ఊరేగించి, వీడియో తీశారు. ఆ వీడియో వైరల్ కావడంతో దేశ వ్యాప్త చర్చకు దారితీసింది. పోలసులు ఐదుగురు అనుమానితులను అరెస్ట్ చేశారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.