అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ నుంచి వ్యోమగాములు శనివారంనాడు సురక్షితంగా తిరిగి భూమిని చేరుకున్నారు. రష్యా దేశానికి చెందిన ఎంఎస్ 24 వ్యోమనౌక ద్వారా కజకిస్థాన్‌లోని గడ్డి మైదానంలో సురక్షితంగా దిగారు. వ్యోమగాములు ఒటెగ్ నోవిట్‌స్కీ, హోరా, మరియానా వాలిలెవ్‌స్కాయాలు భూమికి చేరుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 15న వీరు అంతర్జాతీయ అంతరక్ష కేంద్రానికి చేరుకున్నారు. 204 రోజులు ఐఎన్ఎస్‌లో ప్రయోగాలు చేసిన ఈ శాస్త్రవేత్తలు సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన వారిలో అమెరికా, రష్యా, బెలారస్‌కు చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలున్నారు. వీరంతా సురక్షితంగా భూమికి చేరుకోవడంపై పలు దేశాల అధినేతలు వారికి అభినందనలు తెలియజేశారు.