Muslim Youths Embrace Sanatan Dharma
మధ్యప్రదేశ్‌లోని ఇద్దరు యువకులు ముస్లిం మతాన్ని
వదిలిపెట్టి హిందూధర్మంలోకి ఘర్‌వాపసీ అయ్యారు. జబల్‌పూర్‌కు చెందిన అజీజుల్ హసన్,
అల్లారఖా ఖాన్ అనే ఇద్దరు యువకులు సనాతన ధర్మం పట్ల తమ విశ్వాసాన్ని ప్రకటిస్తూ,
వైదిక సంప్రదాయాల ప్రకారం హిందువులుగా మారారు.
అజీజుల్ హసన్ అశోక్‌నగర్ జిల్లాకు చెందినవాడు.
సనాతన ధర్మంలోకి ప్రవేశించిన సందర్భంగా తన పేరును అనయ్ ఠాకూర్ అని మార్చుకున్నాడు.
బాల్యంలో జబల్‌పూర్‌లోని సరస్వతీ శిశుమందిర్‌లో చదువుకున్నాననీ, అప్పుడే సనాతన
ధర్మంలోని నైతిక విలువలు, పరమత సహనం వంటి విషయాలను గ్రహించగలిగాననీ చెప్పాడు. ఆ
సద్బోధల ప్రేరణతోనే హిందూధర్మంలోకి రావాలని ఉద్దేశపూర్వకంగా నిర్ణయం తీసుకున్నట్లు
వివరించాడు. అల్లారఖా ఖాన్ కూడా జబల్‌పూర్ నివాసే. సనాతన ధర్మంలోకి ప్రవేశించి తన
పేరును విజయ్ చౌహాన్‌గా మార్చుకున్నాడు.
ఈ ఘర్‌వాపసీ కార్యక్రమం జబల్‌పూర్‌లో ఈ ఉదయం చోటు
చేసుకుంది. హిందూధర్మంలోని పద్ధతులపై చిన్నతనం నుంచీ ఆసక్తి ఉండేదనీ, ఇన్నాళ్ళకు
తమ మనసులోని మతాన్ని ఆచరించడం సాధ్యమయిందనీ వారు ఆనందం వ్యక్తం చేసారు. స్థానిక
హిందూసంస్థలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. హిందూధర్మ పద్ధతుల ప్రకారం హోమం
నిర్వహించి సనాతన విధానంలోకి స్వాగతం పలికాయి.