MP HC order on Breakup after Live-in Relationship
సహజీవనంలో ఉండే మహిళల హక్కులను గుర్తించే దిశగా మధ్యప్రదేశ్
హైకోర్టు ముందడుగు వేసింది. గణనీయమైన కాలం సహజీవనం చేసిన తర్వాత విడిపోతే ఆ మహిళకు
ఆ పురుషుడు భరణం చెల్లించాలని చెప్పింది. వారికి చట్టబద్ధంగా వివాహం అవకపోయినా భరణం
చెల్లించి తీరాల్సిందేనని తేల్చింది.
ఒక వ్యక్తి ఒక మహిళతో సహజీవనం చేస్తుండేవాడు.
కొంతకాలం తర్వాత వారు విడిపోయారు. ఆ మహిళ తన జీవిత నిర్వహణ కోసం ఆ పురుషుడి నుంచి
భరణం కోరుతూ కేసు వేసింది. ఆ మహిళకు నెలకు రూ.1500 చొప్పున కట్టాలంటూ ట్రయల్ కోర్టు
ఆదేశించింది. ఆ ఆదేశాన్ని సవాల్ చేస్తూ ఆ వ్యక్తి మధ్యప్రదేశ్ హైకోర్టును
ఆశ్రయించాడు. అయితే కింది కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది.
ఒక జంట సహజీవనం చేస్తే దానికి ఆధారాలు లేనంత
మాత్రాన ఆమెకు భరణం పొందే హక్కును కాదనలేమని న్యాయమూర్తులు స్పష్టం చేసారు.
సహజీవనం చేసిన జంట భార్యాభర్తలుగా ఉండేవారన్న దిగువ కోర్టు పరిశీలనను హైకోర్టు ఆమోదించింది.
ఆ బంధంలో ఉండగా ఆ మహిళ ఒక శిశువుకు జన్మనిచ్చిన విషయాన్ని కూడా పరిగణనలోకి
తీసుకుంది.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు