మరో రెండురోజుల్లో(ఏప్రిల్8) సంపూర్ణ
సూర్యగ్రహణం ఏర్పడనుంది. మెక్సికో,
అమెరికా, కెనడా మీదుగా ఉత్తర అమెరికాను దాటుతూ సంపూర్ణంగా కనిపించనుంది.
కొన్ని కరీబియన్ దేశాలతో పాటు, మెక్సికో, స్పెయిన్, వెనెజులా, కొలంబియా, యూకే, ఐర్లాండ్, పోర్చుగల్, ఐస్ ల్యాండ్ దేశాల్లో పాక్షికంగా గ్రహణం కనిపించనుంది.
నాసా వెల్లడించిన
సమాచారం మేరకు మెక్సికోలో ముందుగా గ్రహణం 11:07 (పీడీటీ కాలమానం)కి కనిపిస్తుంది. ఆ తర్వాత మైన్ వద్ద
సుమారు 01:30 (పీడీటీ)కి ముగుస్తుంది. భారత కాలమానప్రకారం (ఐఎస్టీ)
ప్రకారం ఏప్రిల్ 8న రాత్రి 9:12కి
మొదలై అర్ధరాత్రి దాటాక 02:22కి ముగియనుంది.
భారత్ సహా ఆసియా ఖండంలో మాత్రం గ్రహణం నేరుగా కంటికి కనిపించదు. నాసాతోపాటు
టెక్సాస్ లోని మెక్ డొనాల్డ్ అబ్సర్వేటరీ సూర్యగ్రహణాన్ని లైవ్ స్ట్రీమింగ్
చేయనుంది.