ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ తీరును ప్రధాని మోదీ
మరోసారి ఎండగట్టారు. నేటి భారత్కు కావాల్సిన ఆశలు, ఆశయాలకు దూరంగా ప్రతిపక్ష పార్టీ
ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో ముస్లిం లీగ్ భావజాలాన్ని పోలి ఉందని
దుయ్యబట్టారు.
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో స్వాతంత్రోద్యమం నాటి ముస్లిం లీగ్
ఆనవాళ్ళతో పాటు వామపక్ష భావజాలం నిండి ఉందని ప్రధాని ఆరోపించారు.
యూపీలోని షహరాన్పుర్లో జరిగిన ఎన్నికల సభలో
ప్రసంగించిన ప్రధాని మోదీ, దేశ స్వతంత్య్రం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ కథ
కొన్ని దశాబ్ధాల క్రితమే ముగిసిందన్నారు. జాతీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ వద్ద
ప్రణాళికలు లేవన్న మోదీ, దేశ ప్రగతి పట్ల ఆ పార్టీకి విజన్
కూడా లేదన్నారు.
ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ, ఎస్పీ కలిసి పోటీ చేస్తున్నాయన్న
మోదీ, అధికారంలోకి వస్తే ఆ రెండు పార్టీలు కమిషన్ల కోసమే పనిచేస్తాయని
విమర్శించారు.
బీజేపీని ఎదుర్కొనే పరిస్థితి లేకపోవడంతో సమాజ్వాదీ పార్టీ గంటకో
అభ్యర్థిని మారుస్తుందని ఎద్దేవా చేసిన మోదీ, కాంగ్రెస్ కంచుకోటులుగా పేరున్న
నియోజకవర్గాల్లో కూడా ఆ పార్టీ నేతలు పోటీ చేసేందుకు జంకుతున్నారని అన్నారు.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్