రిటైల్ ఇన్వెస్టర్ల కోసం రిజర్వు
బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా ఓ మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ
యాప్‌తో ప్రభుత్వ బాండ్లు, సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టడం మరింత సులువు
అవుతుందని ఆర్బీఐ అధికారులు వెల్లడించారు.
ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడుల
కోసం రిటైల్ డైరెక్ట్ స్కీమ్‌ను 2021
నవంబర్‌లో ఆర్బీఐ ప్రారంభించింది. ఆర్బీఐ డైరెక్ట్ పోర్టల్ ద్వారా ప్రస్తుతం
ప్రైమరీ, సెకండరీ మార్కెట్ ప్రభుత్వ సెక్యూరిటీల్లో
మదుపు చేసే అవకాశం ఉంది.
ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులను
మరింత సులభతరం చేసేందుకే మొబైల్ యాప్‌ను తీసుకువస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్
శక్తికాంత దాస్ వెల్లడించారు.
ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ నుంచి రూ.14.13 లక్షల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా
అందులో తొలి అర్ధభాగంలోనే రూ.7.5 లక్షల కోట్లు సేకరించాలనుకుంటోంది.