అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో జీయర్ ట్రస్టుపై కేసు నమోదైంది. జీయర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టెక్సాస్ రాష్ట్రంలో అష్టలక్ష్మీ దేవాలయం నడుస్తోంది. మతపరమైన కార్యక్రమంలో ఓ బాలుడికి ఎర్రగా కాల్చిన కడ్డీతో శంఖు, చక్రం ముద్రలు శరీరంపై వేయడంపై కేసు నమోదైంది. బాలుడి తండ్రి విజయ్ ఆలయ నిర్వహణ సంస్థ జీయర్ ట్రస్ట్‌పై రూ.8.3 కోట్ల పరిహారం కోరుతూ దావా వేశారు.
తన కుమారుడిని మాజీ భార్య గుడికి తీసుకు వచ్చిందని, కాల్చిన కడ్డీలతో ముద్రలు వేయడానికి తన అనుమతి తీసుకోలేదంటూ విజయ్ అనే వ్యక్తి కోర్టులో దావా వేశారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో బాలలకు పచ్చబొట్లు వేయడం, కాల్చడం లాంటివి నిషేధించారు. దీనిపై అష్టలక్ష్మీ ఆలయం నిర్వాహకులు జీయర్ ట్రస్టు స్పందించాల్సి ఉంది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు