భారతీయ
జనత పార్టీ(BJP)44వ
వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
తెలిపారు.
‘నేషన్
ఫస్ట్’ నినాదంతో బీజేపీ ముందుకు
సాగుతోందన్న మోదీ, దేశ సేవే ధ్యేయంగా పనిచేస్తుందని
కొనియాడారు. సోషల్ మీడియా వేదికగా బీజేపీ ప్రస్థానాన్ని మోదీ వివరించారు.
దేశవ్యాప్తంగా
ఉన్న బీజేపీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, ఎన్నో కష్టాలు, అవరోధాలు ఎదుర్కొని పార్టీని
బలోపేతం చేసిన ప్రతీకార్యకర్తకు ధన్యవాదాలు అన్నారు. భారతీయులు అత్యంత మక్కువ చూపే
పార్టీ బీజేపీ అని మోదీ అభివర్ణించారు.
భారత
అభివృద్ధి నమూనా పై తనదైన ముద్ర వేసిన బీజేపీ, సుపరిపాలన, నిబద్ధత, జాతీయవాద
విలువలు పాటించే పార్టీ బీజేపీ అని వివరించారు.
బీజేపీతోనే దేశానికి మేలు జరుగుతుందని140
కోట్ల మంది భారతీయులు ఆకాంక్షిస్తున్నారని పేర్కొన్నారు. తమ ఆకాంక్షలను నెరవేర్చే
పార్టీ బీజేపీ మాత్రమేనని 21 వ శతాబ్దపు యువత భావిస్తుందన్నారు. సుపరిపాలనకు తోడు
పేదరికాన్ని రూపుమాపేందుకు బీజేపీ పాలన దోహదపడిందన్నారు. కులతత్వం, మతతత్వాన్ని
సమాజం నుంచి తొలగించడంలో బీజేపీది ఎనలేని పాత్ర అన్నారు.
లోక్
సభ ఎన్నికల అంశాన్ని ప్రస్తావించిన ప్రధాని మోదీ, మరోసారి బీజేపీని ఆశీర్వదించేందుకు
ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ అజెండాను
ప్రజలకు చేరవేస్తున్న బీజేపీ, ఎన్డీయే కార్యకర్తలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
డాక్టర్
శ్యామ్ ప్రకాశ్ ముఖర్జీ, 1951లో జనసంఘ్ ను స్థాపించారు. ఆ తర్వాత 1980, ఏప్రిల్
6న జనసంఘ్ , భారతీయ జనతా పార్టీగా అవతరించింది. ప్రస్తుతం ప్రపంచంలోనే బీజేపీ
అతిపెద్ద పార్టీ గా ఉంది.