భూకంపం అగ్రరాజ్యం అమెరికాను వణికించింది. గురువారం తైవాన్ను వణికించిన భూకంపం శుక్రవారంనాడు అమెరికాను గడగడలాడించింది. అమెరికాలోని తూర్పు, ఈశాన్య ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రాంతంలో అత్యంత అరుదుగా మాత్రమే కంపనాలు వస్తుంటాయి. తాజాగా వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్ స్టేలుపై 4.8గా నమోదైంది. ముఖ్యంగా న్యూయార్క్ నగరం భూకంపంతో వణికిపోయింది. జనం కార్యాలయాలు, ఇళ్ల నుంచి పరుగులు తీశారు.
తాజాగా వచ్చిన భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం నమోదు కాలేదు. దాదాపు అమెరికాలోని ఐదోవంతు జనాభా భూప్రకంపనాలను గమనించారు. 4.8 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు అమెరికా భూభౌతిక పరిశోధనా సంస్థ వెల్లడించింది. భూకంపం ప్రభావంతో కొన్ని విమానాలను దారి మళ్లించారు. రైళ్ల వేగాలను తగ్గించారు. వంతెనలు, రోడ్లను అధికారులు తనిఖీలు చేశారు. మన్హట్టన్, బ్రూక్లిన్ ప్రాంతాల్లో భూకంపం తీవ్రత ఎక్కువగా నమోదైంది. ఐక్యరాజ్యసమితి సమావేశాలకు భూకంపం ఆటంకం కలిగించింది. సమావేశం జరుగుతుండగానే భూకంపం సంభవించింది. అలర్ట్ అలారం మోగింది. దీంతో సభ్యులు అప్రమత్తమయ్యారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు