ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మంత్రి అతిశీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. బీజేపీలో చేరాలంటూ సన్నిహితుల ద్వారా ఆ పార్టీ తనను సంప్రదించిందంటూ అతిశీ చేసిన వ్యాఖ్యలపై భాజపా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఆమె చేసిన నిరాధారమైన ఆరోపణలకు తగిన ఆధారాలు చూపాలంటూ ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో బీజేపీ కోరింది.
బీజేపీ ఇచ్చిన ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. నీవు చేసిన ఆరోపణలపై ఆధారాలను ఎన్నికల సంఘానికి సమర్పించాలంటూ మంత్రి అతిశీకి శుక్రవారంనాడు నోటీసులు జారీచేసింది. దీనిపై అతిశీ మండి పడ్డారు. కేంద్ర ఎన్నికల సంస్థ, బీజేపీకి అనుబంధంగా పనిచేస్తోందా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల సంఘం నోటీసులు ఇవ్వక ముందే బీజేపీ నేతలకు తనకు నోటీసులు వచ్చాయంటూ ఎలా తెలిసిందని ఆమె పలు అనుమానాలు వ్యక్తం చేశారు.