ఎన్నికల
కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాతి నుంచి చేపట్టిన తనిఖీల్లో ఇప్పటివరకు రూ.47.5 కోట్లు స్వాధీనం చేసుకున్నామని
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు.
చెక్
పోస్టుల వద్ద చేపట్టిన తనిఖీల్లో రూ.17.5
కోట్ల నగదు పట్టుబడగా సాధారణ సోదాల్లో భాగంగా 5.13
లక్షల లీటర్ల మద్యం, మాదకద్రవ్యాలను కూడా స్వాధీనం
చేసుకున్నట్లు వెల్లడించారు.
ఎన్నికల్లో
పంచి పెట్టేందుకు సిద్ధం చేసిన బహుమతులు కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా
8,681 లైసెన్స్ డ్ ఆయుధాలు పోలీస్
స్టేషన్లలో జమ చేశారని తెలిపారు.
ఎన్నికలకు
సంబంధించిన ఫిర్యాదులను ఎవరైనా తమకే నేరుగా అందించవచ్చు అన్నారు.
సీఈవో
కార్యాలయంలో ప్రతిరోజూ సాయంత్రం 4
నుంచి 5 గంటల మధ్య ఫిర్యాదులు, వినతులు స్వీకరిస్తామన్నారు. సెలవు
రోజుల్లోనూ సీఈవో కార్యాయలం అందుబాటులో ఉంటుందని తెలిపారు.