కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి
కొలువైన తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది. స్వామి దర్శనానికి సుమారు 16 గంటల సమయం
పడుతోంది. వేసవి సెలవుల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముంది. దీంతో టీటీడీ
పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ భక్తులకు త్వరగా స్వామివారి దర్శనం కల్పించేందుకు
గాను వచ్చే మూడు నెలలపాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు ను
రద్దు చేసినట్లు ఈవో ధర్మారెడ్డి
తెలిపారు.
డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో
పాల్గొన్న ధర్మారెడ్డి, భక్తుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. క్యూ లైన్లు, కంపార్ట్‌మెంట్లులో
వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదం, మజ్జిగ,
స్నాక్స్ , వైద్య
సదుపాయాలు నిరంతరం అందజేస్తామన్నారు.
మాడ వీధులు, నారాయణగిరి
గార్డెన్స్ వెంబడి కూల్ పెయింటింగ్స్, డ్రింకింగ్ వాటర్ పాయింట్లు నెలకొల్పుతున్నామన్నారు. వేసవి రద్దీ సమయంలో భక్తులకు సహాయం అందించేందుకు
స్కౌట్స్, గైడ్స్‌తో పాటు 2500 మంది శ్రీవారి సేవకులను నియమించామని
చెప్పారు. .
తిరుమలో అయోధ్యకాండ పారాయణం
లోకకల్యాణం
కోసం తిరుమలలో ఏప్రిల్ 6న అయోధ్యకాండ అఖండ పారాయణం జరుగనుంది. ఉదయం 6
నుంచి 7.30 గంటల వరకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని
ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా కూడా వీక్షించవచ్చు.
అయోధ్యకాండలోని 31
నుంచి 34వ సర్గ వరకు మొత్తం నాలుగు సర్గల్లో 172
శ్లోకాలు, యోగవాశిష్టం మరియు ధన్వంతరి మహామంత్రంలోని
25 శ్లోకాలు కలిపి మొత్తం 197 శ్లోకాలను పారాయణం చేస్తారు.