ఢిల్లీ లిక్కర్ పాలసీని కొందరికి అనుకూలంగా తయారు చేసి, మనీలాండరింగ్‌నకు పాల్పడ్డారనే ఆరోపణలపై 13 నెలలుగా తిహార్ జైల్లో ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా సంచలన లేఖ విడుదల చేశారు. త్వరలో జైలు నుంచి మీ ముందుకు వస్తున్నానంటూ తన నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించిన ఆయన రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పటికే మనీలాండరింగ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ బెయిల్‌పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
మనం మంచి విద్య, ఆసుపత్రుల కోసం పోరాడుతున్నాం. బ్రిటిష్ వారు కూడా మహాత్మాగాంధీ, నెల్సన్ మండేలాలపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో వేశారు. మనం చేసే పోరాటం ఊరికే పోదు. ఏదొకరోజు ప్రతి ఒక్కరు నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం పొందుతారని సిసోడియా ఆ లేఖలో పేర్కొన్నారు. నేను జైల్లో ఉన్నా అనారోగ్యంతో ఉన్న తన భార్యను కంటికి రెప్పలా కాపాడుకున్న నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలంటూ సిసోడియా రాసిన లేఖ ఇప్పడు రాజకీయ చర్చకు దారితీసింది.