తొలితరం న్యూస్ రీడర్
శాంతిస్వరూప్ తుదిశ్వాస విడిచారు. రెండు రోజుల కిందట గుండెపోటు రావడంతో హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో చేరారు.
చికిత్స పొందుతూ నేడు కన్నుమూశారు.
దూరదర్శన్ (తెలుగు) లో 1983 నవంబర్ 14 నుంచి వార్తలు చదవడం
ప్రారంభించారు. టెలీ ప్రాంప్టర్ లేకుండా కేవలం పేపర్ చూసి పదేళ్ళ పాటు వార్తలు
చదవడం ఆయన ప్రతిభకు నిదర్శనం. 2011లో పదవీ విరమణ చెందారు.
శాంతిస్వరూప్ భార్య రోజారాణి కూడా
టీవీ యాంకర్‌గా పని చేశారు. కొంత కాలం కిందట ఆమె కన్నుమూశారు. వీరికి ఇద్దరు
కుమారులు ఉన్నారు.
ప్రస్తుతం మిసిమి అనే సాహిత్య మాసపత్రికకు సహ
సంపాదకుడిగా వ్యవహరిస్తున్నారు.
సాహిత్యంలో ప్రతిభ కల్గిన శాంతి స్వరూప్, భోపాల్ దుర్ఘటనపై
‘‘’రాతి మేఘం’, సతీ సహగమన దురాచారానికి వ్యతిరేకంగా ‘అర్ధాగ్ని’ నవల రాశారు.
క్రికెట్ పై ఇష్టంతో క్రేజ్ అనే అనే నవల కూడా రాశారు. యాంకరింగ్ లో ఆయన లైఫ్‌టైమ్
అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు.
శాంతిస్వరూప్ మృతి పట్ల రాజకీయ
ప్రముఖులు, జర్నలిస్టులు
సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
సుదీర్ఘకాలం పాటు దూరదర్శన్ లో
వార్తలు చదివిన శాంతి స్వరూప్ తెలుగు ప్రజలకు ఎప్పటికీ చిరస్మరణీయుడేనని తెలంగాణ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.