సార్వత్రిక ఎన్నికల వేళ పోలీసుల తనిఖీల్లో నివ్వెరపరచే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. కర్ణాటకలో ఇప్పటికే అక్రమంగా తరలిస్తోన్న వందల కోట్ల విలువైన బంగారం, మద్యంతోపాటు నగదు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా తమిళనాడు కర్ణాటక సరిహద్దుల్లో అక్రమంగా గిడ్డంగుల్లో దాచిన వంద కోట్ల విలువైన బీర్లను పోలీసులు సీజ్ చేశారు.
ముందుగా అందిన సమాచారం మేరకు ఎన్నికల అధికారులు సోదాలు నిర్వహించారు. చామరాజనగర్ నియోజకవర్గంలోని నంజనగూడలో అనుమతులు లేకుండా గిడ్డంగుల్లో నిల్వ చేసిన వంద కోట్ల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. హమ్మవు గ్రామంలో గిడ్డంగుల్లో దాచిన మద్యాన్ని పోలీసులు, ఎన్నికల అధికారులు ఆకస్మికంగా దాడి చేసి పట్టుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు ఈ ఆపరేషన్ నిర్వహించిన దాదాపు వంద కోట్ల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు.
బీర్ తయారు చేసిన కంపెనీపై కూడా కేసు నమోదైంది. స్టాక్‌లో చూపకుండా బీర్లు తరలించడంపై అధికారులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దాదాపు 7 వేల అట్టపెట్టెల్లో బీర్లను నిల్వ చేసిన గిడ్డంగులను సీజ్ చేశారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు