రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఇవాళ ముంబైలో జరిగిన కీలక సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రెపోరేటు 6.5 శాతం వద్ద కొనసాగించాలని నిర్ణయించారు. ఏడోసారి వడ్డీరేట్లను స్థిరంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు నెలల ద్రవ్యపరపతి విధానంలో భాగంగా సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారుల సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ ఇవాళ మీడియాకు వెల్లడించారు. వడ్డీరేట్లు స్థిరంగా కొనసాగించాలనే నిర్ణయంతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారులకు ఊతం లభించినట్లైంది.