‘లవ్
జిహాద్’ ఇతివృత్తంగా తెరకెక్కిన ‘ది కేరళ స్టోరీ’ చిత్రాన్ని దూరదర్శన్ (డీడీ నేషనల్)లో ప్రసారం
చేయనున్నారు. నేటి రాత్రి (ఏప్రిల్5) 8 గంటలకు ఈ సినిమా ప్రసారం కానుంది.
హిందూ
యువతులను ప్రేమపేరిట లొంగదీసుకుని అనంతరం వివాహం మాటున ఇస్లాం లోకి మార్చడమే ‘లవ్
జిహాద్’ ఉద్దేశం.
నిఖా
తర్వాత వారిని ముస్లిం దేశాలకు తీసుకెళ్ళి తీవ్రంగా హింసించిన ఘటనలు కూడా కోకొల్లలుగా
వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా ఇలాంటి పలు ఘటనలు చోటుచేసుకోగా కేరళలో ఎక్కువగా
బయపటపడ్డాయి.
దీంతో
‘ది కేరళ స్టోరీ’ పేరిట ఓ చిత్రాన్ని నిర్మించి, లవ్ జిహాదీ పేరిట జరుగుతున్న అకృత్యాలు,
సనాతన మతంపై సాంస్కృతికంగా జరుగుతున్న దాడిని
కళ్ళకు కట్టినట్లు ఈ చిత్రంలో చూపారు.
ఈ చిత్రం మొదలైనప్పటి నుంచి
కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నేతలు ఈ
సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు.
ఓటీటీ
లో స్ట్రీమ్ అయిన ఈ మూవీ తాజాగా దూరదర్శన్ లో ఈ రోజు రాత్రికి ప్రసారం కానుంది. దీనిని
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో పాటు ఇతర కమ్యూనిస్టు పార్టీల నేతలు
వ్యతిరేకిస్తున్నారు.
‘’వివాదాస్పద
‘ది కేరళ స్టోరీ’ సినిమాతో రెండు మతాల మధ్య విద్వేషాలు పొడసూపే అవకాశం ఉందని’’ కేరళ
సీఎం పినరయి విజయన్ అన్నారు. ఎన్నికల వేళ ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉన్నందున
ప్రసారం చేయడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మత ప్రచార
యంత్రంగా డీడీ మారొద్దని తన ఎక్స్ ఖాతాలో విజయన్ పేర్కొన్నారు.
సినిమా
విడుదల సమయంలోనూ థియేటర్లలో ప్రదర్శించకుండా కేరళ ప్రభుత్వం అడ్డుకోవడంతో కొందరు
కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు కొన్ని సీన్లకు కత్తెర వేసి సినిమాను ప్రదర్శించాల్సి
వచ్చింది.