పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో చోటు చేసుకున్న అరాచకాలపై కోల్‌కతా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లైంగిక వేధింపులు, అత్యాచారాలు, కబ్జాలపై అక్కడ టీఎంసీ నేత షాజహాన్ షేక్‌కు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. దీనిపై కోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారించిన హైకోర్టు మమతా సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు బెంగాల్ మహిళలకు సురక్షితమేనా అని ప్రశ్నించింది. సందేశ్‌ఖాలీ వివాదంపై దర్యాప్తు జరిపించాలంటూ దాఖలైన అఫిడవిట్లపై హైకోర్టు స్పందించింది.
కోర్టులో దాఖలైన అఫిడవిట్లలో ఒక్క శాతం నిజం ఉన్నా…అది బెంగాల్ సర్కార్‌కే సిగ్గుచేటని ధర్మాసనం అభిప్రాయపడింది. అందుకు మమతా సర్కార్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. 55 రోజుల పాటు షాజహాన్ పరారీలో ఉండటంపై కూడా కోర్టు అసహనం వ్యక్తం చేసింది. షాజహాన్‌ను 55 రోజుల తరవాత అరెస్టు చేసి కోర్టు ఆదేశాల మేరకు కస్టడీకి తరలించిన సంగతి తెలిసిందే.
‘
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు