JSP changes its candidate in Railway Koduru Assembly
Constituency
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు రైల్వేకోడూరు
నియోజకవర్గంలో జనసేన పార్టీ తమ అభ్యర్ధిని మార్చింది. ఆ నియోజకవర్గంలో అరవ శ్రీధర్
ఎన్నికల బరిలో ఉంటారని ప్రకటించింది.
మొదట ఆ సీటులో యనమల భాస్కరరావు పోటీ చేస్తారని
జనసేన ప్రకటించింది. అయితే క్షేత్రస్థాయి నివేదికలు, జిల్లా నాయకుల అభిప్రాయాలను
పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఇతర ముఖ్యనాయకులు పరిశీలించారు. పవన్ కళ్యాణ్
పిఠాపురంలో ఎన్నికల ప్రచారంలో ఉండగా రైల్వే కోడూరుకు చెందిన జేఎస్‌పీ, టీడీపీ
నాయకులు అక్కడికే వెళ్ళి తమ నియోజకవర్గంలోని పరిస్థితిని వివరించారు. యనమల
భాస్కరరావు అభ్యర్థిత్వంపై సర్వేల్లో సానుకూలత
రాలేదు. మిత్ర పక్షమైన తెలుగుదేశం వైపు నుంచి కూడా అనుకూలత రాలేదు. అక్కడ
అభ్యర్థిని మార్చాలని నాయకులు తమ అభిప్రాయాలను తెలియచేశారు. ఆ నేపథ్యంలో అరవ
శ్రీధర్‌ను తమ పార్టీ అభ్యర్ధిగా జనసేన ప్రకటించింది.
ఇక ఇటీవలే జనసేన పార్టీలో చేరిన తెలుగుదేశం నాయకుడు మండలి
బుద్ధప్రసాద్‌కు అవనిగడ్డ అభ్యర్ధిత్వం ఖరారు చేస్తూ ఈ ఉదయం పార్టీ ఒక ప్రకటన
విడుదల చేసింది. పాలకొండ నియోజకవర్గంలో కూడా, టీడీపీ నుంచి ఇటీవలే జేఎస్‌పీలో
చేరిన నిమ్మక జయకృష్ణకు సీటు దాదాపు ఖరారైనట్లే తెలుస్తోంది.