ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు స్వల్ప ఊరట లభించింది. లిక్కర్ పాలసీని కొందరికి అనుకూలంగా తయారు చేసి, మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే కేసులో తిహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన పిల్‌ను కోర్టు కొట్టివేసింది. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించేందుకు ముగ్గురు సభ్యుల ధర్మాసనం తిరస్కరించింది. విష్ణు గుప్తా వేసిన ఈ పిల్‌కు విచారణ అర్హత లేదని ఢిల్లీ హైకోర్టు బెంచ్ అభిప్రాయపడింది.
సీఎం పదవిలో ఉండాలా? రాజీనామా చేయాలా అనేది కేజ్రీవాల్ తేల్చుకోవాలని కోర్టు అభిప్రాయపడింది. దీనిపై న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఢిల్లీ లెప్ట్‌నెంట్ గవర్నర్, రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సి ఉటుందని కోర్టు స్పష్టం చేసింది.దీనిపై కోర్టు మార్గదర్శకత్వం అవసరం లేదని అభిప్రాయపడింది.