శ్రీ
వరాహ లక్ష్మీనరసింహ స్వామి కొలువైన సింహాచలం ఆలయం, స్వామివారి వార్షిక కళ్యాణోత్సవానికి
ముస్తాబవుతోంది. ఏప్రిల్ 19న స్వామివారికి కళ్యాణోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపిన
ఆలయ అధికారులు, మే 10న చందనోత్సవం ఉంటుందన్నారు.
ఫాల్గుణ
ఏకాదశిరోజున వార్షిక కళ్యాణోత్సవం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి ప్రత్యేక
కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఏప్రిల్ 19న
రాత్రి 8 గంటలకు రథోత్సవం రంగరంగ వైభవంగా జరగనుంది. ఈ ఏడాది కూడా
చందనోత్సవం సందర్భంగా స్వామి నిజరూప దర్శనానికి లక్ష మంది భక్తులు వస్తారని అంచనా
వేస్తున్నారు. అందుకు తగిన ఏర్పాట్లలో ఆలయ అధికారులు నిమగ్నమయ్యారు.
కళ్యాణోత్సవం,
చందనోత్సవం ఏర్పాట్లపై సింహాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాస మూర్తి,
సమీక్ష నిర్వహించారు. అర్చకుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు.
ఈ
కార్యక్రమంలో స్థానాచార్యులు టీపీ రాజగోపాల్, ప్రధాన అర్చకుడు గొడవర్తి
శ్రీనివాసాచార్యులు, అలంకారి సీతారామచార్యులు, పాలకమండలి సభ్యుడు గంట్లా
శ్రీనుబాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు శ్రీనివాసరాజు, ఏఈవో పాలూరి నర్సింగరావు
పాల్గొన్నారు.